ప్రస్తుతం ఆస్ట్రేలియా తాజాగా టిక్‌టాక్‌పై చర్యలు తీసుకునేందుకు రంగంలోకి దిగింది. టిక్‌టాక్‌లో స్టోర్ అయి ఉన్న తమ పౌరుల డేటా, వారి ప్రైవసీ, డేటా స్టోరేజ్ భద్రత తదితర అంశాలను పరిశీలిస్తోంది. దీంతో టిక్‌టాక్‌కు ఇంకా భయం పట్టుకుంది. టిక్‌టాక్ నిజానికి గత కొద్ది వారాల కిందటే ఆస్ట్రేలియాలో తన కార్యాలయాలను ప్రారంభించింది.
ఇక ఆస్ట్రేలియాకు చెందిన టిక్‌టాక్ యూజర్ల డేటా సింగపూర్, అమెరికాల్లో ఉందని.. టిక్‌టాక్ ఆస్ట్రేలియా ప్రతినిధులు చెప్తున్నారు. వారి డేటా అత్యంత భద్రంగా ఉందని హామీ ఇస్తున్నారు. అయినప్పటికీ టిక్‌టాక్‌పై ఆస్ట్రేలియా సూక్ష్మ పరిశీలన చేస్తోంది. ఏవైనా తేడాలు వస్తే వేటు వేసేందుకు ఆస్ట్రేలియా కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.