వాట్సప్ పేమెంట్స్ కోసం కాంటాక్ట్స్‌తో చేసే చాట్స్ అయినా.. ఇతర పేమెంట్ సమాచారం అయినా సరే.. సరికొత్త థీమ్స్‌తో సెట్ చేసుకోవచ్చు. ఏదైనా అకేషన్ ఉన్నా.. పండుగ ఉన్నా.. స్పెషల్ డే ఉన్నా.. ఆ రోజు సరికొత్త థీమ్స్‌ను వాట్సప్ అందులో పొందుపరుస్తుంది. దీంతో.. ఆ అకేషన్‌ను బట్టి థీమ్‌ను సెట్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్‌ను మరింత అందంగా తీర్చిదిద్దుకోవచ్చు.
ఇప్పటికే ఇండియాలో డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్స్ పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే.. మార్కెట్‌ను ఏలుతున్నాయి. వాటికి కాంపిటిషన్‌గా వాట్సప్ పేమెంట్ సిస్టమ్‌ను ప్రారంభించింది. ఇతర వాలెట్స్ పనిచేసినట్టుగానే.. వాట్సప్ పేమెంట్ సిస్టమ్ కూడా యూపీఐ ద్వారా పనిచేసేలా అనుసంధానించారు.