సర్వే ప్రకారం.. దాదాపు 88 శాతం మంది ఉద్యోగులు ఆఫీస్‌కు రావాలని ఒత్తిడి చేస్తే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 46 శాతం మంది ప్రస్తుతం వాళ్లు చేస్తున్న ఉద్యోగాల్ని పక్కనపెట్టి .. వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం ఉన్న ఉద్యోగాల కోసం అన‍్వేషిస్తున్నారట. కాగా, వీరిలో ఎక్కువ శాతం వర్కింగ్ మదర్స్ ఉన్నారు.
ఇటీవల మూన్‌లైటింగ్ తెరపైకి వచ్చి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు వచ్చి పని చేయాలని సంస్థలు పట్టుబడుతున్నాయి. ప్రస్తుతం హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్ వంటి అగ్రశ్రేణి ఐటి సంస్థలు సైతం వారానికి కనీసం మూడు రోజులు ఉద్యోగులను కార్యాలయానికి పిలుస్తున్నాయి.