చెన్నై విమానాశ్రయంలో రూ.100 కోట్ల హెరాయిన్ స్వాధీనం

శుక్రవారం, 7 మే 2021 (22:36 IST)
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో వంద కోట్ల రూపాయల విలువ చేసే హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు టాంజానియా దేశస్థులను అదుపులోకి తీసుకున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆఫ్రికా దేశమైన టాంజానియా నుంచి భారత్‌కు భారీ మొత్తంలో డ్రగ్స్‌ రవాణా జరుగుతుందని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయ కస్టమ్స్‌ అధికారులకు విశ్వసనీయ సమాచారం అందింది. 
 
దీంతో అధికారులు నిఘా పెట్టి అక్రమ రవాణాకు పాల్పడుతున్న టాంజానియా నుంచి చెన్నైకు వచ్చిన విమానంలోని ప్రయాణికులను తనిఖీ చేశారు. ఆసమయంలో 43 యేళ్ల మహిళను, 45 యేళ్ళ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు కస్టమ్స్‌ కమిషనర్‌ రాజన్‌ చౌదరి తెలిపారు.
 
హెరాయిన్‌ను పాలిథిన్‌ సంచుల్లో కట్టి వాసననురాకుండా ఇందులో మసాలా పొడిని చల్లినట్లు ఆయన చెప్పారు. తనతోపాటు తన సహాయకుడు వైద్యం కోసం బెంగళూర్‌ వెళ్తున్నట్లు చెప్పి మహిళ వీసా పొందిందని అధికారులు విచారణలో గుర్తించారు. బెంగళూర్‌కు నేరుగా విమానం లేకపోవడంతో చెన్నైలో దిగి పట్టుబడినట్లు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు