భారత సైన్యంలో మహిళలకు చోటు దక్కనుంది. భారత సైన్యంలో కమాండ్ హోదాలో మహిళలు పనిచేయడానికి అర్హులేనని, అలాగే సైన్యంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ ఏర్పాటుచేయాలని సుప్రీంకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆదేశాలు జారీ చేసింది. ఇంతకు ముందున్న నిబంధనల ప్రకారం, మహిళలకు పర్మినెంట్ కమిషన్ లేదు.