కొవిడ్ నేపథ్యంలో ఇంటి నుంచి పని, ఆన్‌లైన్ తరగతులు తప్పనిసరి అయ్యాయి. ఇందుకు స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారు. దీంతోపాటు వినోదం కోసం చిత్రాలు, వీడియోలు చూసేందుకూ స్మార్ట్‌ఫోన్‌నే వినియోగించడం పెరిగింది.
ఫలితంగా రోజులో సగటున 7 గంటల పాటు సెల్‌ఫోన్‌తోనే ప్రజలు గడుపుతున్నారని సీఎంఆర్-వివో సంస్థల అధ్యయనంలో తేలింది. 2019లో రోజులో సగటున 4.9 గంటలు, 2020 మార్చిలో 5.5 గంటల సేపు స్మార్ట్‌ఫోన్‌ను వినియోగించారని గుర్తించారు. మార్చి చివరిలో లాక్‌డౌన్ విధించడంతో, సెల్‌ఫోన్ అవసరం పెరిగింది.
ఫలితంగా ఏప్రిల్‌లోనే సెల్‌ఫోన్ వినియోగం 25 శాతం అధికమై 6.9 గంటలకు చేరిందని స్మార్ట్‌ఫోన్లు-మానవ సంబంధాలపై ప్రభావం నివేదిక పేర్కొంది. హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, అహ్మదాబాద్, పుణె నగరాలలోని 2000 మంది పురుషులు-మహిళల నుంచి సేకరించిన అభిప్రాయాలతో రూపొందించిన నివేదికలోని మరిన్ని అంశాలివీ..