సోమవారం ఉదయం పశ్చిమ, దానికి ఆనుకుని తూర్పుమధ్య అరేబియా సముద్రంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. దీనికి "లుబన్" అని ఒమన్ నామకరణం చేసింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి ఒమన్ తీరం దిశగా కదులుతోంది. రానున్న ఐదు రోజుల్లో ఒమన్ పరిసరాల్లో తీరం దాటే క్రమంలో తీవ్ర పెనుతుఫానుగా మరింత బలపడనుంది.
రెండు సముద్రాల్లో ఒకేసారి తుఫాన్లు రావడం అప్పుడప్పుడు జరుగుతుంటుందని, ఇలా ఒకేసారి రావడం వల్ల రెండు తుఫాన్లు బలపడతాయని, తీరందాటే సమయంలో ఎక్కువ ప్రభావం చూపుతాయని వాతావారణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.