రాహుల్ ఓ హైబ్రిడ్! నాన్న ముస్లిం.. అమ్మ క్రిస్టియన్.. కొడుకు బ్రాహ్మణుడా? ఎలా?

గురువారం, 31 జనవరి 2019 (12:29 IST)
బీజేపీ సీనియర్ నేత అనంత కుమార్ హెగ్డే మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాన్న ఓ ముస్లిం, అమ్మ క్రిస్టియన్ అయితే... కొడుకు బ్రాహ్మణుడు ఎలా అవుతాడంటూ ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
ఇదే అంశంపై ఆయన కేంద్ర మంత్రి హెగ్డే మాట్లాడుతూ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాఁధీ ఓ హైబ్రిడ్ నమూనా అని చెప్పారు. ముస్లిం తండ్రి, క్రిస్టియన్ తల్లికి పుట్టిన వ్యక్తి బ్రాహ్మణుడినని చెప్పుకుంటూ తిరుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఏ మతానికి చెందిన వాడినన్న విషయం రాహుల్‌కు తెలియదని, ఆయన అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు.
 
ఓ కుటుంబ మతం, కులానికి సంబంధించి, ఇంత నమూనాలు మరే కుటుంబంలోనూ లేవని, అది ఒక్క కాంగ్రెస్ పార్టీ అధినేతలకే సాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. మరో రెండు నెలల్లో రాహుల్ కొలంబియాకు పారిపోవాల్సిందేనంటూ జోస్యం చెప్పారు. కాగా, హెగ్డే వ్యాఖ్యలపై అంతే తీవ్రతతో స్పందించిన రాహుల్, ఆయన వ్యాఖ్యలు ప్రతి భారతీయుడినీ అగౌరవపరిచేవేనని అన్నారు. ఇకపై ఒక్క రోజు కూడా హెగ్డేకు కేంద్ర మంత్రిగా కొనసాగే అర్హత లేదన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు