ఇది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని, దీన్ని కొట్టిపారేయలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవీ చంద్రసూడ్ అభిప్రాయపడ్డారు. జమ్మూ కాశ్మర్ భారతదేశంలో చేరినప్పుడు సార్వభౌమాధికారం లేదని.. కేంద్రం తీసుకునే ప్రతి చర్యనూ సవాల్ చేయకూడదని సీజేఐ అన్నారు.
అయితే, ఈ రాజ్యాంగ ధర్మాసనంలో ఆశీనులైన సీజేఐ జస్టిస్ చంద్రసూడ్‌తో పాటు.. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనంలోని ఐదుగురు జడ్జిలు మూడు రకాల తీర్పులను వెలువరించారు. ఇది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని.. ఆర్టికల్ 370 రద్దుపై పార్లమెంటు నిర్ణయాన్ని కొట్టిపారేయలేమని సీజేఐ స్పష్టం చేశారు. అలాగే, మరో రెండు భిన్న తీర్పులను వెలువరించింది. ఈ తీర్పునకు సంబంధించి పూర్తి వివరాలు రావాల్సివుంది.