డ్రోన్ల ద్వారా కోవిడ్ వ్యాక్సిన్లు : కేంద్రం నిర్ణయం

మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (11:48 IST)
దేశంలోని మారుమూల ప్రాంతాలకు, ఏజెన్సీలకు, తండాలకు కరోనా వ్యాక్సిన్లను ఇకపై డ్రోన్ల ద్వారా సరఫరా చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ నిర్ణయించింది. 
 
ముఖ్యంగా, అండమాన్‌, నికోబార్‌ ద్వీపాలతో పాటు మణిపుర్‌, నాగాలాండ్‌లోని మారుమూల ప్రాంతాలకు... డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లను తీసుకువెళ్లేలా భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌)కి షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది. 
 
గరిష్టంగా 3 వేల మీటర్ల ఎత్తులో మాత్రమే ఈ డ్రోన్లను నడపాలని స్పష్టం చేసినట్టు సోమవారం వెల్లడించింది. పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల తెలంగాణలో ‘డ్రోన్ల ద్వారా ఔషధాల సరఫరా’ ప్రాజెక్టును ప్రారంభించిన క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు