ప్రపంచ ఆహార దినోత్సవం.. అక్కడ ఐదు, పది పైసలకే బిర్యానీ..?!

శుక్రవారం, 16 అక్టోబరు 2020 (16:45 IST)
పది పైసలకు బిర్యానీ ఇవ్వడంతో భారీగా క్యూ కట్టారు జనం. ఇదెక్కడ జరిగిందంటే? ధర్మపురి జిల్లాలో. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, ధర్మపురి జిల్లాలోని ఇండూర్ ప్రాంతంలో ప్రారంభించబడిన ఓ కొత్త హోటల్‌ మాంసాహార ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పేలా బిర్యానీ పది పైసలకే ఇస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. పది పైసలకు వేడి వేడిగా బిర్యానీ ఇస్తున్నట్లు సదరు హోటల్ ప్రకటించగానే భారీ స్థాయిలో ప్రజలు క్యూ కట్టారు. 
 
కరోనా అనే విషయాన్ని కూడా పట్టంచుకోకుండా పది పైసలతో.. మాస్కులతో క్యూ కట్టారు. ఒకొనెకల్‌కు చెందిన బాలాజీ అనే వ్యక్తి ఎంసీఏ పూర్తి చేసి.. గత మూడేళ్ల పాటు చెన్నై, బెంగళూరుల్లో కొన్ని సంస్థల్లో పనిచేశాడు. కరోనా ఉద్యోగాన్ని కోల్పోయిన ఆ వ్యక్తి.. లాక్ డౌన్ కారణంగా తన సొంతూరు అయిన ఇండూరుకు చేరుకున్నాడు. అక్కడ సొంతంగా వ్యాపారం చేయాలనుకున్నాడు. 
 
దీనికోసం అతడు రెస్టారెంట్ వ్యాపారాన్ని ఎంచుకున్నాడు. ఇందులో భాగంగా రెస్టారెంట్ ప్రారంభించే రోజున పది పైసలకు బిర్యానీ ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఇంకా పది పైసల కోసం జనాలు వెతకడం మొదలెట్టారు. అయినప్పటికీ వారికి లభించిన పది పైసల నాణేలతో బిర్యానీ కొనేందుకు జనం ఎగబడ్డారు. అయితే పది పైసల నాణెంతో వచ్చిన 200 మందికి మాత్రమే బిర్యానీ ఇవ్వడం జరిగింది. 
 
ఇదిలా ఉంటే.. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకుని తమిళనాడులోని,  దిండుక్కల్‌లో ఐదు పైసల నాణేనికి చికెన్ బిర్యానీ అందించాడు ఓ హోటల్ యజమాని. ఐదు పైసలను తెచ్చే 500మందికి ప్లేట్ చికెన్ బిర్యానీ అందించడం జరిగింది. దీంతో దిండుక్కల్ బస్టాప్ వద్ద వున్న ఆ హోటల్‌కు జనాలు భారీ సంఖ్యలో చేరుకుని బిర్యానీ కొనుక్కెళ్లారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు