రాహుల్ టీ షర్ట్ ధర రూ.41 వేలు అయితే ప్రధాని మోడీ కళ్లద్దాల ధర రూ.1.50 లక్షలు!

శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (20:03 IST)
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ "భారత్ జోడో" పేరుతో కన్యకుమారి నుంచి శ్రీనగర్ వరకు యాత్ర చేపట్టారు. గత బుధవారం తమిళనాడు నుంచి ప్రారంభమైన ఈ యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. అయితే, ఈ యాత్రలో భాగంగా, మూడో రోజున రాహుల్ ధరించిన టీ షర్టు ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఈ టీషర్టు ధర రూ.41,357 అని భారతీయ జనతా పార్టీ  పేర్కొంది. పైగా, తన ట్విట్టర్ ఖాతాలో రాహుల్ ధరించిన టీషర్టుతో పాటు దాని ధరను తెలుపుతూ ఉండే ఫోటోను షేర్ చేసి... "భారత్ దేఖో" అనే క్యాప్షన్‌ను జోడించింది. ఈ ట్వీట్ వైరల్ అయింది. కాసేపటికే కాంగ్రెస్ పార్టీ గట్టిగానే కౌంటరిచ్చింది. 
 
రాహుల్ గాంధీ పాదయాత్రకు లభిస్తున్న ఆదరణ చూసి బీజేపీ వణికిపోతోందని ఆరోపించింది. పైగా, దేశంలోని నిరుద్యోగంపై మాట్లాడేందుకు బదులు రాహుల్ ధరించిన టీషర్టుపై బీజేపీ వ్యాఖ్యలు చేస్తోందంటూ ఆరోపించింది. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై బీజేపీ దృష్టిసారిస్తే తాము కూడా అందుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ గట్టిగానే బదులిచ్చింది. 
 
ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాల్లో ప్రధాన నరేంద్ర మోడీ ధరించిన దుస్తులు, వాటి ధరలను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించింది. దుస్తులపై చర్చిద్దామంటే మోదీ ధరించిన సూట్ ధర రూ.10 లక్షలు, మోడీ వినియోగించే కళ్ళద్దాల ధర రూ.1.50 లక్షలుపైనా కూడా చర్చించేందుకు తాము సిద్ధమంటూ కౌంటరిచ్చింది. 

 

अरे... घबरा गए क्या? भारत जोड़ो यात्रा में उमड़े जनसैलाब को देखकर।

मुद्दे की बात करो... बेरोजगारी और महंगाई पर बोलो।

बाकी कपड़ों पर चर्चा करनी है तो मोदी जी के 10 लाख के सूट और 1.5 लाख के चश्मे तक बात जाएगी।

बताओ करनी है? @BJP4India https://t.co/tha3pm9RYc

— Congress (@INCIndia) September 9, 2022

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు