టీచర్నే కాదు.. ఆమె కుమార్తెని కూడా రేప్ చేస్తానన్నాడు- మరో విద్యార్థి ఏం చేశాడంటే..?

బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (11:54 IST)
ఉపాధ్యాయురాలికి తన విద్యార్థి నుంచే లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. ఈ ఘటన గుర్‌గ్రామ్‌లోని ఓ పాఠశాలలో చోటుచేసుకుంది. తనకు విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయురాలిని, తనతో పాటు చదువుతున్న ఆమె కుమార్తెను అత్యాచారం చేస్తానని ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి బెదిరించాడు. అలాగే మరో ఎనిమిదో తరగతి విద్యార్థి టీచర్‌కు అభ్యంతరకర ఈ-మెయిల్ పంపాడు. ఈ ఘటన కూడా అదే గుర్‌గ్రామ్‌లో జరిగింది.
 
అయితే వీరిద్దరినీ సదరు యాజమాన్యాలు సస్పెండ్ చేశాయి. సరిగ్గా చదవట్లేదని ఉపాధ్యాయురాలు మందలించడంతోనే ఏడో తరగతి విద్యార్థి ఆమెతో పాటు ఆమె కుమార్తెను కూడా రేప్ చేస్తానని బెదిరించాడని.. దీంతో జడుసుకున్న విద్యార్థిని పాఠశాల మానేసింది. 
 
అంతేగాకుండా టీచర్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. మరో ఘటనలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి, తన టీచర్‌ను పడకను పంచుకోవాలని అసభ్యకర సందేశం పంపాడు. ఈ ఘటనలో నిందితుడైన విద్యార్థిని పాఠశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు