శివప్ప నాయక సర్కిల్‌లో వేడివేడి పకోడాలు తయారు చేస్తూ ప్రజలకు వాటిని పంచుతూ వీరంతా నిరసన తెలిపారు. దేశంలో అంతకంతకూ పెరిగిపోతున్న నిరుద్యోగం, ఆర్థిక మందగమన పరిస్థితులకు వ్యతిరేకంగా వీరంతా నినాదాలు చేశారు. దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఆర్థిక మందగమన పరిస్థితుల్లో ప్రజలు ఉద్యోగాలు కోల్పోయి, పేదరికంలోకి జారుకుంటున్నారంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను వారు ఎండగట్టారు.
'ఆర్థిక వ్యవస్థ దిగజారుడు పేదరికానికి దారి తీస్తోంది', 'ఆర్థిక మందగమనంతో ఏడు కోట్ల ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది', 'వరదల అనంతర సహాయక చర్చల్లో బీజేపీ వైఫల్యం చెందింది' అనే నినాదాలతో కూడిన ప్లకార్డులను వీరు ప్రదర్శించారు.