చైనాను మించిపోయిన భారత్.. 86వేలకు చేరిన కరోనా కేసులు

శనివారం, 16 మే 2020 (09:57 IST)
కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ కోవిడ్ విజృంభిస్తోంది. అలాగే మనదేశంలో కరోనా కేసుల సంఖ్యను మనదేశం కూడా దాటేసింది. చైనాలో 82,941 కరోనా కేసులు నమోదవగా.. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 86 వేలకు చేరువైంది.
 
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,970 కొత్త కేసులు నమోదు కాగా.. 103 మంది ప్రాణాలు కోల్పోయారు.. తాజా కేసులను కలుపుకుంటే భారత్‌లో ఇప్పటి వరకు 85,970 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 2,752కు చేరింది. 
 
ఇక, కరోనా బారినపడి ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో 53,035మంది చికిత్స పొందుతుండగా.. 30,152 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా...రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్ర 29,100 తమిళనాడు 10,108 గుజరాత్ 9931, ఢిల్లీ 8895, ఆంధ్రప్రదేశ్ 2157, తెలంగాణలో 1454 కరోనా కేసులు నమోదయ్యాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు