కులాలే ముఖ్యం.. కుంభమేళాలు, దేవాలయాలు తిండిపెడతాయా?

మంగళవారం, 1 జనవరి 2019 (18:07 IST)
రాజస్థాన్‌లో మంత్రి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తాను తన కులం కోసం పనిచేసేందుకే తొలి ప్రాధాన్యత ఇస్తానని మహిళా, శిశు సంక్షేమ మంత్రి మమతా భూపేశ్ పేర్కొన్నారు. 
 
అల్వార్ జిల్లా రేణి పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమలో ఆమె మాట్లాడుతూ.. తన కులానికి చెందిన ప్రజల అభివృద్ధి కోసమే ముందు పనిచేస్తానన్నారు. తర్వాతే సమాజం గురించి ఆలోచిస్తానని తెలిపారు. అయితే అందరికోసం పనిచేయడమే తన ఉద్దేశమంటూ క్లారిటీ ఇచ్చారు. 
 
మరోవైపు ఒకవైపు తాము ఉద్యోగాలు, హక్కుల కోసం పోరాడుతోంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుంభమేళాలు, దేవాలయాలు అంటూ కోట్లు కుమ్మరిస్తోందంటూ మాజీ బీజేపీ నేత సావిత్రిబాయి పూలే అన్నారు. 
 
గుళ్లు, గోపురాల వంటివి కాకుండా రాజ్యాంగాన్ని అమలు చేస్తే దేశ ప్రగతిలో మార్పు వస్తుందని ఆవిడ అన్నారు. కుంభమేళాలు, దేవాలయాలు దళిత, గిరిజన, ముస్లింలకు ఏమన్నా తిండి పెడతాయా? ప్రజల దృష్టిని మరల్చడానికే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. 
 
కోట్ల డబ్బును వృధా చేస్తున్నారు. దేశం దేవుడితో కానీ దేవాలయంతో కానీ పాలించబడదు. దేశాన్ని పాలించేది రాజ్యాంగం అని సావిత్రిబాయి అన్నారు. అంతే కాకుండా ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతల విషయమై ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్‌పై సావిత్రిబాయి మండిపడ్డారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు