దూసుకొస్తున్న గజ... శ్రీహరికోట వద్ద తీరం దాటే ఛాన్స్...

సోమవారం, 12 నవంబరు 2018 (10:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు.. ఉత్తర తమిళనాడు రాష్ట్రానికి 'గజ' తుఫాను ముంపు పొంచివుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని కొనసాగుతున్న వాయుగుండం శనివారం సాయంత్రానికి తీవ్ర రూపం దాల్చించింది. ఇది చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 1140, నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 1180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. 
 
గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పయనిస్తున్న ఈ తుఫాను మరింతగా బలపడి పశ్చిమ నైరుతి దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రల వైపు పయనిస్తుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో 13వ తేదీ నుంచి దక్షిణకోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దాంతో తీరా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వేటలో ఉన్న మత్స్యకారులు వెనక్కి రావాలని సూచించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు