ఈ చందమామను అమెరికాలో లాంగ్ నైట్స్ మూన్ (లాంగ్ నైట్స్ మూన్), కోల్డ్ మూన్ (Cold Moon) అని పిలుస్తున్నారు. క్రిస్మస్ తర్వాత వచ్చే సంపూర్ణ చందమామను అలా పిలుస్తారు. యూరప్‌లో యూలే తర్వాత వచ్చే చందమామ (Moon after Yule) అంటారు.
డిసెంబర్ 29న రాత్రి 10.30కి సంపూర్ణ చందమామ అమెరికాలో మొదలవుతుంది. భారతీయులకు మాత్రం డిసెంబర్ 30 ఉదయం 8.58కి మొదలవుతుంది. ఐతే... 29 రాత్రి, 30 రాత్రి వేళ చందమామ సంపూర్ణంగానే కనిపిస్తుంది. ఈ రెండ్రోజులూ టెలీస్కోప్ పెట్టి చూస్తే చందమామ ఎంతో కాంతివంతంగా, ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఇందుకు కారణం... గాలిలో ఉండే మంచే. కంటికి కనిపించని అతి చిన్న మంచు కణాలు... గాలిలో ఎగురుతూ చందమామను మెరిసేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.