ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కారు దొరికింది. ఆయన కారును శనివారం ఘజియాబాద్‌లోని మోహన్ నగర్ సమీపంలో కారును పోలీసులు గుర్తించారు. రెండు రోజుల క్రితం బ్లూ వ్యాగనార్ డీఎల్9 సీజీ 9769 నంబరు కలిగిన కారు కనిపించకుండా పోయిన విషయం తెల్సిందే. ఢిల్లీ సచివాలయం ఎదుట పార్కింగ్ చేసిన ఈ కారు అపహరణకు గురైంది. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి.
'కారుకే భద్రత లేకపోతే.. ఇక సామాన్యుడి మాటేంటి? కారు పోవడం చిన్న విషయమే.. కానీ అది సచివాలయం ఎదుట పోయింది. ఢిల్లీలో శాంతి, భద్రతలు గాడితప్పుతున్నాయనడానికి ఈ ఘటన నిదర్శనం' అంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌ను సీఎం కేజ్రీవాల్ ప్రశ్నించారు. 2013లో కుందర్ శర్మ అనే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆ కారును కేజ్రీవాల్‌కు విరాళమిచ్చారు. ఈ కారును పోలీసులు గుర్తించారు.