భర్తను చంపేసింది.. కరోనాపై నేరం మోపింది.. ఎక్కడ?

శుక్రవారం, 8 మే 2020 (18:29 IST)
కట్టుకున్న భర్తను హతమార్చి... ఆ నేరాన్ని కరోనా ఖాతాలో వేసేసింది... ఓ భార్య. అయితే పోస్ట్‌మార్టంలో అసలు నిజం బయటకు వచ్చింది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని అశోక్‌విహార్‌లో శరత్ దాస్‌(46), అతడి భార్య అనిత(30) నివాసముంటున్నారు.
 
మే 2న శరత్ నిద్రలేవకపోగా.. కరోనాతో అతడు మృతి చెందాడని ఇరుగుపొరుగు వారికి అనిత తెలిపింది. అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని శరత్ కరోనాతో మృతిపై చెందాడని చెప్పడంపై ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది. దీంతో అతడి అంత్యక్రియలు అడ్డుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
 
పోస్ట్‌మార్టంలో శరత్ ఊపిరాడక మృతి చెందాడని తేలింది. దీంతో పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. సంజయ్ అనే వ్యక్తితో తాను ప్రేమలో వున్నానని.. ఈ విషయంపై తరచుగా తన భర్తకు, తనకు గొడవ జరిగేదని తెలిపింది. అందుకే హతమార్చినట్లు తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు