అత్యాచార బాధితురాలి ప్రాణాలు కాపాడేందుకు... వైద్యుల సాహసం

వరుణ్

గురువారం, 29 ఫిబ్రవరి 2024 (13:55 IST)
అత్యాచార బాధితురాలి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు ఓ అరుదైన సాహసం చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లోని ఎస్ఎంఎస్ ఆస్పత్రి వైద్యులు ఈ సాహసానికి పాల్పడ్డారు. శ్వాస తీసుకునేందుకు ఆమె శ్వాసనాళాన్ని తెరిచి అందులో పైపు పెట్టాలని నిర్ణయించారు. ఈ మొత్తం ప్రక్రియ ట్రాకియోస్టమీ అంటారు. ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు ఏర్పాటైన మెడికల్ బోర్డు బాధితురాలి ప్రాణాలను కాపాడేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తుంది. ప్రస్తుతం ఆమె ఎంఎంఎస్ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతుంది. 
 
జైపూర్ జిల్లాలో శనివారం కోట్‌పుత్లి - బెహ్రార్‌లో ఓ యువతిపై ముగ్గురు యువకులు దాడి చేశఆరు. ఆపై ఆమెపై కాల్పులు జరిపి పారిపోయారు. వెళ్లూవెళ్తూ పదునైన ఆయుధంతో ఆమెపై దాడి చేశారు. దీంతో ఆమె పొట్ట చీరుకుపోవడంతో వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ విజయవంతమైందని ప్రకటించారు. అయితే, ఆమెకు మంగళవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఫలితం పాజిటివ్‌గా వచ్చింది. దీంతో ఆమెకు గురువారం మరోమారు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు