పెళ్లి వరుడు స్నేహితులు చేసే హంగామా అంతాఇంతా ఉండదు. ఆ స్నేహితులు చేసిన అతి కారణంగా ఓ పెళ్లి రద్దు అయింది. పెళ్లితో తమతో పాటు డ్యాన్స్ చేయాల్సిందిగా వధువు చేయి పట్టుకుని కొందరు ఫ్రెండ్స్ లాగారు. అంతే.. వధువుకు చిర్రెత్తుకొచ్చింది. పెళ్ళి కుమారుడిని చెడామడా తిట్టేసి... పెళ్లి పీటలపైనుంచి లేచిపోయింది. ఈ హఠాత్ పరిణామంతో పెళ్లికి వచ్చిన ఆహ్వానితులంతా బిక్కమొహమేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బరేలి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువకుడుకి, కన్నౌజ్ జిల్లాకు చెందిన ఓ యువతికి పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. పెళ్లి కోసం వధువు కుటుంబ సభ్యులు శుక్రవారం బరేలీ చేరుకున్నారు. పెళ్లి వేడుక బ్రహ్మాండంగా జరుగుతున్న వేళ వరుడి స్నేహితులు కళ్యాణమండపంలోకి అడుగుపెట్టారు. తమతో కలిసి డ్యాన్స్ చేయాలంటూ వధువు చేయి పట్టుకుని డ్యాన్స్ఫ్లోర్ పైకి లాగారు.
అంతేకాదు, వరుడి కుటుంబంపై వరకట్న కేసు కూడా నమోదైంది. దీంతో దిగొచ్చిన పెళ్లి కొడుకు బంధువులు రూ. 6.5 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని, ఇరు కుటుంబాలు ఓ ఒప్పందానికి వచ్చాయని పోలీసులు తెలిపారు.