ఆ వీడియోలో ఉన్నది నేనా? కాదా? అనేది అనవసరం: హార్దిక్ పటేల్

మంగళవారం, 28 నవంబరు 2017 (15:37 IST)
పటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ సెక్స్ వీడియోలు ఓ మీడియా ఛానల్‌లో ప్రసారం అయ్యాయి. వీటిపై హార్దిక్ పటేల్ స్పందించారు. హార్దిక్‌ను దెబ్బతీసేందుకు అధికార బీజేపీ నేతలు సెక్స్ వీడియోల అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారని తెలిపారు. అవన్నీ మార్ఫింగ్ వీడియోలేనని.. అందుకే ప్రస్తుతం స్నానం చేసే ముందు కిటికీలు తలుపుల కూడా మూసేస్తున్నానని నవ్వుతూ చెప్పారు. 
 
గుజరాత్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బిజెపి అనేక రకాల ప్రయత్నాలను చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడంతోనే అశ్లీల వీడియోల పేరుతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. తన వ్యక్తిగత జీవితంపై ప్రశ్నించే అధికారం ఎవ్వరికీ లేదన్నారు. ఆ సీడీలో ఉన్నది తానా? కాదా? అనే విషయం ఎవరికీ అవసరం లేదని చెప్పుకొచ్చారు. 
 
తనకు రూ.రెండుకోట్లు ఇస్తే అదే వీడియోలో గుజరాత్ సీఎం విజయ్ రూపానీ  ముఖాన్ని కూడా పెట్టగలనని తెలిపారు. ఇలాంటి వీడియోల ద్వారా బీజేపీ చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు