ఆర్డ్నెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

ఠాగూర్

శుక్రవారం, 24 జనవరి 2025 (14:18 IST)
మహారాష్ట్రలోని భారీ పేలుడు సంబవించింది. భండారా జిల్లాలోని ఓ ఆర్డ్నెన్స్  ఫ్యాక్టరీలో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఉదయం 10.30 గంటల సమయంలో ఇది చోటుచేసుకున్నట్లు జిల్లా కలెక్టర్‌ సంజయ్‌ కోల్తే వెల్లడించారు. పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీ పైకప్పు కూలిపోయింది.

ఈ శబ్దం 5 కిలోమీటర్ల వరకు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకుంది. ప్రమాదం సమయంలో ఫ్యాక్టరీలో 12 మంది ఉన్నారు. వీరిలో ఇద్దరిని కాపాడినట్లు సమాచారం. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఒకరి మృతిని అధికారులు ధ్రువీకరించారు. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 
భాక్రా కాలువలో 22 యేళ్ల ట్రైనీ ఎయిర్‌హోస్టెస్ నిషా మృతదేహం 
 
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి జిల్లా సెరు గ్రామానికి చెందిన 22 యేళ్ల ఎయిర్‌హోస్టెస్ ట్రైనీ నిషా హత్యకు గురైంది. ఆమె మృతదేహాన్ని పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలా సమీపంలో ఉన్న భాక్రా కాలువలో స్వాధీనం చేసుకున్నారు. ఆమెను 33 యేళ్ల పోలీస్ అధికారి హత్య చేశారు. అతని పేరు యువరాజ్. మొహాలీలో విధులు నిర్వహిస్తున్న యువరాజ్... నిషాను హత్య చేసి మృతదేహాన్ని భాక్రా కాలువలో పడేశాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, ఈ నెల 27వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. 
 
పోలీసు ల కథనం మేరకు... నిషా, యువరాజ్‌లు మంచి స్నేహితులు. గత మూడేళ్లుగా నిషా చండీగఢ్‌లో ఉంటూ ఎయిర్ హోస్టెస్‌గా శిక్షణ పొందుతోంది. సెరు గ్రామంలోని తన ఇంటికి వెళ్లిన ఆమె సోమవారం తిరిగి చండీగఢ్‌కు వచ్చింది. జనవరి 20 సాయంత్రం, నిషా, యువరాజ్ చండీగఢ్‌లోని ఆమె పేయింగ్ గెస్ట్ వసతి నుండి బయలుదేరారు. తర్వాత నిషా ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబసభ్యులు పలుమార్లు ప్రయత్నించినా ఆమెను సంప్రదించలేకపోయారు. 
 
దీంతో ఆమె కుటుంబ సభ్యులు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనవరి 21న ఆమె మృతదేహం భాక్రా కెనాల్‌లో పాక్షికంగా దుస్తులు ధరించి కనిపించింది. జనవరి 22న, మహిళను గుర్తించేందుకు ఆమె ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న యువరాజ్‌పై హత్య కేసు నమోదైంది. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు