దీనిని నివారించే ఉద్దేశంతో కనీస నిల్వ నిబంధనను ఎత్తివేసింది. ప్రభుత్వ తాజా ప్రకటనతో ఫాస్టాగ్‌లో కనీస మొత్తం లేకున్నా అనుమతిస్తారు. అయితే, ఆ మొత్తాన్ని ఫాస్టాగ్ సెక్యూరిటీ డిపాజిట్ నుంచి మినహాయించుకుంటారు.
వాహనదారులు ఆ తర్వాత చెల్లించే టోల్ ఫీజు విషయంలో దీనిని కూడా కలుపుతారు. కాగా, ప్రస్తుతం 80 శాతం వరకు టోల్ చెల్లింపులు ఫాస్టాగ్ ద్వారానే జరుగుతున్నాయి. ఈ నెల 15 నాటికి దీనిని వంద శాతానికి తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.