బుధవారం ఆయన చెన్నైలో పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులతో సమావేశమైన స్టాలిన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి గవర్నర్ విద్యాసాగర్ రావు తెరపడేలా సత్వర చర్యలు తీసుకోవాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. అన్నాడీఎంకే పార్టీ చీలిపోయిన కారణంగా ఇరువర్గాల్లో ఎవ్వరూ స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరని స్టాలిన్ గుర్తు చేశారు.
అందుచేత త్వరలో ఎన్నికలు రావడం ఖాయమని స్టాలిన్ నొక్కిచెప్పారు. ఇందుకోసం డీఎంకేలోని ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త సిద్ధంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిస్థితులను బట్టే స్టాలిన్ ఇలా మాట్లాడారని రాజకీయ పండితులు అంటున్నారు. త్వరలో అమ్మ పార్టీలో చీలిక ఏర్పడుతుందని వారు కూడా జోస్యం చెప్తున్నారు. దీంతో డీఎంకే పార్టీ లబ్ధిపొందుతుందని తెలిపారు.