వైద్య పరీక్షల అనంతరం బాబాను జైలుకు తరలించనున్నారు. అక్కడ ఆయనకు జైలు యూనిఫాం, ప్రత్యేక గది కేటాయిస్తారు. బాబాకు శిక్ష ఖారారైన అనంతరం పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మాట్లాడుతూ ప్రస్తుతం పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని, పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని పేర్కొన్నారు. కోర్టు తీర్పును ప్రజలు గౌరవించాలని, సంయమనం పాటించాలని కోరారు.
కోర్టు తీర్పు అనంతరం డేరా బాబా అనుచరులు మరోమారు హింసాత్మక చర్యలకు దిగారు. మెగా, సిర్సా ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగాయి. దీంతో ఈ రెండు ప్రాంతాలతో సహా పలు ఏరియాల్లో కర్ఫ్యూ విధించారు. పుల్కా ఏరియాలో డేరా బాబా అనుచరులు రెండు కార్లు తగులబెట్టారు. అలాగే, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు అదనపు బలగాలను తరలిస్తున్నారు.