తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీ శివారు ప్రాంతమైన గురుగావ్‌కు 26 యేళ్ళ ఆకాశ్ అనే యువకుడు ఓ దళిత యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని దళిత యువతి సొంతగ్రామానికి చెందిన కొందరు అగ్రకులస్థులు దాడిశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆకాశ్ చనిపోయాడు.
ఈ ఘటనపై మృతుడి సోదరుడు మాట్లాడుతూ, ఐదు నెలల క్రితం దళిత యువతిని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి బెదిరింపులు వస్తున్నాయని చెప్పాడు. గత ఆదివారం భార్య తల్లిదండ్రులతో మాట్లాడేందుకు ఆమెతో పాటు గురుగావ్‌లోని బాద్షాపూర్‌కు తన సోదరుడు వెళ్లాడని... ఆ సందర్భంగా గ్రామంలో ఆయనపై దాడి చేశారని తెలిపాడు.
ఈ కేసుకు సంబంధించి ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వీరు రిమాండ్ లో ఉన్నారు. ఆకాశ్‌ను హత్య చేసిన ఐదుగురూ దళిత యువతి గ్రామానికి చెందినవారే. వీరు ఐదుగురు అగ్రవర్ణానికి చెందినవారు. ఈ కారణం వల్లనే గ్రామంలోకి రావద్దంటూ అతడిని హెచ్చరించారు. అయినా గ్రామంలోకి రావడంతో కొట్టి, చంపేశారు.