తమిళనాడు భారీ వర్షాలు... నీట మునిగిన చెన్నై

ఆదివారం, 7 నవంబరు 2021 (12:38 IST)
తమిళనాడు భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. శనివారం సాయంత్రం నుంచి చెన్నై, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో వాన కుండపోతగా కురిసింది. దీంతో చెన్నై మహానగరంలోని అనేక ప్రాంతాలు నీటమునిగాయి. 
 
ప్రధానంగా ఉత్తర చెన్నైతో పాటు.. టి నగర్, అడయారు, కొరటూరు, సైదాపేట, వేళచ్చేరి, కోడంబాక్కం, వడపళని, పెరంబూర్‌, అన్నాశాలై, గిండి, మైలాపూర్ తదితర  ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. 
 
చెన్నైలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఏకంగా 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలోని చాలా ప్రాంతాల్లో అధికారులు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. తాంబరం - చెంగల్పట్టు మధ్య సబర్బన్ లోకల్‌ రైళ్లను రైలు సర్వీసులను రద్దు చేశఆరు. 
 
భారీ వర్షాలకు చంబరంబాక్కం, పళల్ రిజర్వాయర్లు నిండుకుండలా మారాయి. ఏ క్షణమైన డ్యాం గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా, రానున్న 24 గంటల్లో చెన్నై, దాని చుట్టుపక్క ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు