ఎన్సీటీ పరిధిలోని ఫరీదాబాద్‌లో ఓ దారుణం జరిగింది. తనతో సహజీవనం చేస్తున్న మహిళను ఓ వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేసి మృతదేహాన్ని బెడ్ కింద దాచాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఎలుక చనిపోయిందని ఇంటి యజమానిని నమ్మించాడు. హత్య చేసిన రెండు రోజుల తర్వాత అక్కడ నుంచి పారిపోయాడు. ఆ తర్వాత తాను చేసిన పని నానమ్మకు చెప్పడం ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జితేంద్ర అనే వ్యక్తి 40 యేళ్ల క్రితం సోనియా అనే మహిళతో కలిసి ఫరీదాబాద్‌లోని జవహర్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అయితే, గత వివాహం ద్వారా తనకు కలిగిన కుమార్తె విషయంలో ఇద్దరి మధ్య ఏప్రిల్ 21వ తేదీన గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన జితేంద్రం... ఆ మహిళను గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని బెడ్ కింద దాచాడు. దుర్వాసన రాకుండా అగరుబత్తులు వెలిగించాడు.
గదిలో ఎలుక చనిపోయిందని అందుకే అరుబత్తీలు వెలిగిస్తున్నానని ఇంటి యజమానిని నమ్మించాడు. అయితే, దుర్వాసన ఎక్కువ కావడంతో జితేంద్ర ఇంటి నుంచి పారిపోయాడు. తనతో ఉంటున్న మహిళను చంపేశానని నానమ్మకు చెప్పగా, ఆవిడ పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.