ఇదిలావుండగా, జల్లికట్టు పోటీలకు పెట్టిందిపేరైనా అలంగానల్లూరులో యధేచ్చగా జల్లికట్టు పోటీలు నిర్వహించారు. అందంగా ఆలంకరించిన ఎద్దులను వీధుల్లోకి వదిలారు. ఆ తర్వాత వందలాదిమంది యువకులు వాటి వెంట పరుగుడెతూ.. ఎద్దులను పరుగు పెట్టించారు. తద్వారా కోర్టు ఆంక్షలను పట్టించుకోకుండా జల్లికట్టు నిర్వహించామని నిరూపించారు.
అయితే, పోలీసులు వెంటపడి వీరిని కొట్టేందుకు ప్రయత్నించినా వెనక్కి తగ్గలేదు. జల్లికట్టును నిర్వహించిన జనాన్ని చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. ఎద్దులను లాక్కుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇంతలోపే ప్రజలు చేయాలనుకున్నది చేసేశారు. అలంగానల్లూరులో భారీగా పోలీసులను మోహరించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.
సోమవారం ఉదయమే ఎద్దులను ఆలంకరించి, స్థానిక కాళీయమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. పోలీసులు దానికి అభ్యంతరం చెప్పలేకపోయారు. అదే జల్లికట్టు నిర్వహణకు అనుకూలంగా మలచుకున్న స్థానికులు ఈ పోటీలను యధేచ్చగా నిర్వహించారు.