వాషింగ్‌మెషీన్‌లో లస్సీ, మజ్జిగ ఎలా తయారు చేస్తున్నారంటే?

శుక్రవారం, 16 జూన్ 2017 (08:55 IST)
వేసవి కాలంలో ఎండల వేడిమిని తగ్గించుకోవాలంటే.. ఎక్కువ ద్రవపదార్థాలను తీసుకుంటాం. ప్రజల దాహార్తిని తీర్చేందుకు కొన్ని స్వచ్ఛంధ సంస్థలు నీరు, మజ్జిగ అందిస్తుంటాయి. అయితే భారీ మొత్తంలో మజ్జిగను తయారు చేయాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుందన్న విషయం తెలిసిందే. కానీ జమ్మూ కాశ్మీర్‌ వాసుల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగను అందించాలని భావించిన స్థానిక గోల్ మార్కెట్ సభ్యులో వినూత్నరీతిలో ఆలోచించారు.
 
బ‌ట్ట‌లు ఉతికే వాషింగ్‌మెషిన్‌లో మజ్జిగను త‌యారు చేస్తున్నారు. ఓ కొత్త‌ వాషింగ్‌మెషిన్‌ను కొని పెరుగు, ఉప్పు, కొత్తిమీరల‌ను అందులో వేసి స్విచ్ ఆన్ చేస్తున్నారు. దీంతో ఈజీగా మ‌జ్జిగ త‌యార‌యిపోతోంది. ఎండాకాలం అయిపోయాక ఆ వాషింగ్‌మెషిన్‌ని ఎవరికైనా దానం చేస్తామని ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ ఎండాకాలంలో దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను స్వచ్ఛంధ సంస్థలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి