ఈ వివరాలను పరిశీలిస్తే, జార్కండ్ రాష్ట్రంలోని దుమ్కాలో పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న అంకిత(19)ను షారుక్ హుస్సేన్ అనే యువకుడు ప్రేమించాలంటూ వేధిస్తూ వచ్చాడు. అందుకు అంకిత అంగీకరించలేదు. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న హుస్సేన్ ఈ నెల 25వ తేదీ వేకువజామున ఆమె నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
ఫలితంగా ఆమె శరీరం 90 శాతం మేరకు కాలిపోయింది. రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్థరాత్రి దాటాక (ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటలకు) అంకిత మరణించింది. ఈ విషయం బయటకు తెలియడంతో దుమ్కాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మృతురాలు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న హుస్సేన్ కోసం గాలిస్తున్నారు.