ఆంధ్రా బ్యాంకు ఖాతాదారులకు వినతి...

గురువారం, 28 జనవరి 2021 (19:45 IST)
దేశంలో బ్యాంకుల విలీన ప్రక్రియలో భాగంగా, ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేశారు. దీంతో ఆంధ్రా బ్యాంకు ఖాతాదారులంతా ఇకపై యూనియన్ బ్యాంకు ఖాతాదారులుగా మారిపోయారు. దీంతో ఆంధ్రా బ్యాంకు ఖాతాదారులకు యూనియన్ బ్యాంకు తాజాగా ఓ విజ్ఞప్తి చేసింది. 
 
ఆంధ్రా బ్యాంకు పాత కస్టమర్లకు బ్యాంకు ఖాతా నంబరు పాతదే ఉంటుంది. అలాగే, కస్టమర్ ఐడి పాతదే ఉంటుంది. అయితే, కొత్త పాస్‌బుక్ యూనియన్ బ్యాంకు ముద్రతో అందజేస్తారు. ఆంధ్ర బ్యాంక్ చెక్ బుక్‌లో 31/03/2021 తారీఖు వరకు మాత్రమే పనిచేస్తాయి. తర్వాత పని చేయివు. 
 
ఏప్రిల్ 1 నుండి యూనియన్ బ్యాంకు చెక్కు బుక్కులు కొత్తవి తీసుకోవాలి. ఆంధ్రా బ్యాంక్ ఐఎఫ్ఎస్సీ కోడ్ 31/03/ 2021 వరకు మాత్రమే పని చేస్తుది. ఏప్రిల్ 1 నుండి యూనియన్ బ్యాంక్ ఐఎఫ్ఎస్సీ కొత్త కోడ్ మీ దగ్గరిలో యూనియన్ బ్యాంక్ లేదా ఆంధ్రబ్యాంక్ తెలుసుకోవాల్సి ఉంటుంది.
 
ఇంకా ఏమైనా నా సందేహాలు ఉంటే యూనియన్ బాంక్ కస్టమర్ కేర్ నెంబర్‌కు 1800 208 2244 ఫోను చేసి తెలుసుకోవచ్చు. మొబైల్ బ్యాంకింగ్ వాడేవారు యు-మొబైల్ యాప్ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు