వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ రాష్ట్రంలోని 24 పరగణాల జిల్లాలోని ఓ ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృత్యువాతపడ్డారు. గ్యాస్ సిలిండర్ పేలిన ఇంటిని బాణాసంచా తయారీ కేంద్రంగా ఉపయోగిస్తూ వచ్చారు. దీంతో ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. పేలుడు ధాటికి నలుగురు ఆచూకీ తెలియడం లేదు. మరికొందరు గాయపడ్డారు.
పేలుడు సంభవించి సమయంలో ఇంట్లో 11 మంది ఉండగా, వీరిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురి ఆచూకీ తెలియాల్సివుంది. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరికొందరు గాయపడ్డారు. సిలిండర్ పేలుడు కారణంగా మంటలు వ్యాపించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.