ఇటీవలే ఆమె ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో మేనేజర్‌గా చేరింది. ఆమెను ఇంప్రెస్ చేసే ఉద్దేశంతో తాను ఓ ఎయిర్‌లైన్ కంపెనీలో సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్‌గా చేరినట్టు చెప్పి.. ఆమెను బుట్టలో వేసుకున్నాడు. ఆపై డబ్బులు గుంజడం మొదలుపెట్టాడు. తనకు బాగా దగ్గరి బంధువు ఒకరు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డానని చెప్పి.. అనేక దఫాలుగా ఆమె నుంచి రూ.6.5లక్షలు తీసుకున్నాడు.
అబార్షన్ కోసం వచ్చిన మహిళ, డబ్బులిచ్చిన మోసపోయిన ఇద్దరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు అత్యాచారం, మోసం కేసు నమోదు చేసి, అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.