60 రోజుల గడువులోగా పూర్తి ఛార్జిషీటు దాఖలు చేయడంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విఫలమైందని వాదిస్తూ కవిత తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 11, 2024న కవితను సీబీఐ అక్రమంగా అరెస్టు చేసిందని వారు ఆరోపించారు.
జూన్ 7న సీబీఐ అసంపూర్తిగా ఛార్జ్ షీట్ దాఖలు చేసిందని, తమ చార్జ్ షీట్‌లో తప్పులు ఉన్నాయని కవిత తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. సిఆర్‌పిసి 167(2) ప్రకారం డిఫాల్ట్ బెయిల్ పొందే హక్కు కవితకు ఉందని న్యాయవాదులు న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు.