పొదల మాటున కొన్ని జంటలు చేసే చర్యలతో ఫిర్యాదులు అందడంతోనే ఈ నిబంధన పెట్టినట్లు పార్కు నిర్వహణాధికారులు వెల్లడించారు. పార్కులో సర్టిఫికేట్ లేకుండా, చూపించకుండా తిరిగే జంటలపై పోలీసు కేసు నమోదు చేస్తామని నిర్వహణాధికారులు తెలిపారు. ఈ నిబంధన కారణంగా పార్కుకి హాజరయ్యే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయినట్లు సమాచారం.
ఆధార్, వివాహ ధ్రువీకరణ పత్రం లేకుండా జంటలు ఈ పార్కుకు వచ్చే అవకాశం లేదని చెప్పడంతో స్థానికులు కొందరు ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని.. వివాహమైనా ధ్రువీకరణ పత్రాలు తీసుకోని వారు ఏం చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ కోవై పార్కు నిర్వహణాధికారులు నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయబోమని తేల్చి చెప్తున్నారు.