ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి మరోమారు గట్టి షాక్ తగిలింది. చిదంబరాన్ని అరెస్టు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతిచ్చింది. చిదంబరాన్ని కస్టడీలోనే విచారణ జరిపేందుకు అనుమతివ్వాలని ఈడీ చేసిన అభ్యర్థనను కోర్టు అంగీకరించింది.
అయితే, చిదంబరాన్ని కోర్టు ప్రాంగణంలోనే అరెస్టు చేసేందుకు ఈడీ అనుమతి కోరగా, న్యాయమూర్తి తిరస్కరించారు. ప్రముఖ వ్యక్తిని బహిరంగ ప్రదేశంలో విచారించి అదుపులోకి తీసుకోవడం గౌరవంగా ఉండదని కోర్టు ఈడీకి సూచించింది.