కుక్క, పాము జగడానికి దిగాయి. శునకం బిడ్డలను పాము కాటేస్తుంటే తమాషా చూసినట్లు చూశారు. ఆ దృశ్యాలను సెల్ ఫోనులో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వెర్రి ఆనందం పొందారు. ఒడిషాలోని భద్రక్‌లో విషాదం చోటు చేసుకుంది. కుక్క పిల్లలను భారీ నాగుపాము కాటేసింది. పాముకాటుకు కుక్క పిల్లలు మృతి చెందాయి.
అయితే, ఈ దృశ్యాలను సెల్ ఫోన్‌లో బంధిస్తున్న స్థానికులు పామును మళ్లీ శునకంపైకి ఊసిగొల్పారు. మళ్లీ కుక్క పిల్లల వద్దకు చేరుకున్న పాము శునకం పిల్లలను కాటేసింది. పాము కాటుకు మూడు కుక్క పిల్లలు అక్కడికక్కడే మృతిచెందాయి.