అయోధ్య తీర్పు .. గెలుపోటముల అంశం కాదు : ప్రధాని మోడీ

శనివారం, 9 నవంబరు 2019 (12:00 IST)
అయోధ్య తీర్పు గెలుపోటలముల అంశంగా చూడొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. వివాదాస్పద అయోధ్య అంశంపై సుప్రీంకోర్టు శనివారం చారిత్రాత్మక తీర్పును వెలువరించిన విషయం తెల్సిందే. ఈ తీర్పుపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ, అయోధ్య కేసులో సుప్రీం తీర్పును ఎవరి గెలుపోటముల అంశంగానూ చూడకూడదన్నారు. 
 
'అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. గత కొద్ది నెలలుగా ఈ వ్యాజ్యంపై సుప్రీం కోర్టు తరచుగా వాదనలు ఆలకించింది. ఈ సమయంలో సమాజంలోని అన్ని వర్గాలూ సద్భావనతో మెలిగేందుకు చేసిన ప్రయత్నాలు ప్రశంసనీయం. దేశంలో శాంతి, సామరస్యపూర్వక, సానుకూల వాతావరణాన్ని నెలకొల్పేందుకు.. సమాజంలోని అన్ని వర్గాలూ చేసిన కృషి స్వాగతించదగ్గది. కోర్టు తీర్పు తర్వాత కూడా మనమంతా కలిసి ఇదే సామరస్యాన్ని కొనసాగించాలి. అయోధ్యపై ఎలాంటి తీర్పు వచ్చినా అది ఎవరి గెలుపు, ఓటములకు సంబంధించిన విషయం కాదు' అని వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు