ఐఎన్ఎస్ విక్రాంత్ జల ప్రవేశం - నవ భారత్‌కు కొత్త ఐడెంటిటీ

శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (13:30 IST)
పూర్తి దేశీయంగా తయారైన ఐఎన్ఎస్ విక్రాంత్ శుక్రవారం భారతీయ నౌకాదళంలో చేరింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ యుద్ధ నౌకను సముద్రంలోకి జలప్రవేశం చేయించారు. భారతీయ నౌకాదళ చిత్రలో ఇప్పటివరకు ఇంత పెద్ద యుద్ధ నౌకను స్వదేశీయం తయారు చేయలేదు. కొచ్చిలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తదితరులు పాల్గొన్నారు. 
 
యుద్ధ విమానాలను మోసుకెళ్ళే ఐఎన్ఎస్ విక్రాంత్ నౌకాదళంలోకి చేర్చుతున్న సందర్భంగా కొచ్చిన్ షిప్ యార్డులో భారీ కార్యక్రామాన్ని నిర్వహించారు. ఈ యుద్ధ నౌట బరువు 45 వేల టన్నులు. దాదాపు రూ.20 వేల కోట్ల వ్యయంతో నిర్మించారు. 
 
మారిటైమ్ జోన్‌ను ఐఎన్ఎస్ విక్రాంత్ రక్షిస్తుందని, నేవీలో ఉన్న మహళా సైనికులు ఆ విధుల్లో చేరుతారని, అపరిమితమైన సముద్ర శక్తి, హద్దులు లేని మహిళా శక్తి.. నవ భారత్‌కు ఓ ఐడెంటీగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.


 

#WATCH | Shaping a dream building a nation. Designed by the Indian Navy and constructed by CSL Cochin, a shining beacon of AatmaNirbhar Bharat, IAC #Vikrant is all set to be commissioned into the Indian Navy.

(Source: Indian Navy) pic.twitter.com/LpHADHTlPk

— ANI (@ANI) September 2, 2022

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు