దొంగను అరెస్టు చేసిన హోంగార్డు.. లంచం తీసుకుని వదిలేసిన పోలీసులు..

ఆదివారం, 23 జులై 2023 (13:21 IST)
సహోద్యోగుల అవినీతిని చూసి తట్టుకోలేకపోయిన ఓ హోంగార్డు హైవేపై నిరసనకు దిగారు. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ తాజాగా జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హోంగార్డు నిరసనతో అక్కడ కాసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది.
 
'నేను దొంగలను అరెస్టు చేస్తే మా పోలీస్ స్టేషనులో వాళ్లు లంచం తీసుకుని వదిలేస్తున్నారు' అంటూ భోగ్పూర్ ప్రాంతంలో పఠాన్‌కోట్ హైవేపై హోంగార్డు నిరసనకు దిగాడు. తొలుత ఆ హోంగార్డు రహదారికి అడ్డంగా ఓ తాడు కట్టి ట్రాఫిక్ వెళ్లేందుకు మార్గం లేకుండా చేస్తూ నిరసనకు దిగారు. 
 
మరో పోలీసు అతడిని అడ్డుకోవడంతో ఈమారు రోడ్డుపై బస్సుకు అడ్డంగా పడుకున్నారు. ఈ క్రమంలో అతడిని మరో పోలీసు కాలితో తన్నాడన్న ఆరోపణ కూడా సంచలనం కలిగిస్తోంది. హోంగార్డు ఆరోపణలపై భోగ్‌పూర్ స్టేషన్ ఇంచార్జ్ స్పందించారు. ఓ వివాదానికి సంబంధించి హోంగార్డు ఓ యువకుడిని అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకొచ్చాడని, అయితే అతడిని బెయిలుపై విడుదల చేశామని చెప్పారు. 


 

‘Jehra mai chor fad ke liauna oh Thane Wale paise laike chadi jande’
रिश्वतखोरी से दुखी हो कर पुलिस मुलाजिम ने #jalandhar के भोगपुर में रोड जाम कर विरोध प्रदर्शन किया। #PunjabPolice pic.twitter.com/QyajO37Cvd

— Harpinder Singh (@HarpinderTohra) July 22, 2023

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు