అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప (41) కొత్త పెళ్లికూతురైంది. ఆమె ఢిల్లీకి చెందిన ప్రముఖ న్యాయవాది రామస్వామిని రెండో పెళ్లి చేసుకుంది. వీరి వివాహం సోమవారం ఢిల్లీలో జరిగింది. మొదటి భర్త లింగేశ్వరన్‌తో విభేదాల కారణంగా గతంలోనే ఆమె విడాకులు తీసుకున్నారు.
దీంతో ఆమె రెండో పెళ్లికి అవాంతరాలు తొలగిపోవడంతో న్యాయవాది రామస్వామిని పెళ్లి చేసుకున్నారు. కాగా రామస్వామితో తనకు గతంలోనే పెళ్లయిందనీ.. తామిద్దరికీ ఓ పాప ఉన్నట్లు వారం రోజుల క్రితం రామస్వామి భార్య సత్యప్రియ మధురై హైకోర్టులో ఫిర్యాదు చేసింది.
పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం విచారణ ముగిసేవరకు రామస్వామి ఎవర్నీ వివాహం చేసుకోవద్దని ఆదేశాలు జారిచేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ రామస్వామి, శశికళ పుష్ప తాజాగా వివాహం చేసుకోవడం గమనార్హం.
Expelled ADMK MP Sasikala Pushpa got married with Advocate Ramasamy despite the stay of Chennai High Court Madurai Branch... pic.twitter.com/gkGUY1tkjj