టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్‌లో మరోసారి పెళ్లి భాజాలు మోగనున్నాయి. ప్రేమజంట దీపికా పదుకునే, రణవీర్ సింగ్‌ల వివాహానికి ముహూర్తం సిద్ధమైంది. వివాహం కోసం దీపికా పదుకునే షాపింగ్ మొదలెట్టింది. దీపికా పదుకునే బెంగుళూరులో తన తల్లి, చెల్లితో కలసి షాపింగ్‌లో బిజీ బిజీగా వుంది.