కారులో వేరొక మహిళతో కులికిన రోహిత్.. ఒకే గ్లాసులో మద్యం.. అపూర్వ అందుకే?

శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (11:25 IST)
మాజీ సీఎం ఎన్డీ తివారీ కుమారుడిని ఆతని భార్యే హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో రోహిత్ శేఖర్ తివారీ భార్య ఎలా హతమార్చిందనే అంశంపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో అపూర్వ ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని అదనుగా తీసుకుందని.. దిండును రోహిత్ ముక్కుపై అదిమి ఊపిరాడక చేసిందని చెప్పుకొచ్చారు. 
 
ఇంకా ఈ హత్యోదంతంలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. దిండుతో నొక్కిపెట్టి ఊపిరాడకుండా చేసి కేవలం రెండు నిమిషాల్లో అపూర్వ తన భర్తను చంపేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 15న రోహిత్‌ ఉత్తరాఖండ్‌ నుంచి ఢిల్లీకి కారులో వస్తుండగా డిన్నర్‌ రెడీ చేసేందుకు అపూర్వ భర్తకు వీడియో కాల్‌ చేసింది. ఆ సమయంలో కారులో మరో మహిళ ఉంది. రోహిత్ ఈ విషయాన్ని దాచేందుకు ప్రయత్నించాడు. కానీ గాజుల శబ్ధంతో పాటు సదరు మహిళ దుస్తులు అపూర్వకు కనిపించాయి. 
 
దీంతో శేఖర్ ఇంటికి చేరుకున్నాక కారులోని మహిళ గురించి నిలదీసింది. ఆమె, తాను ఒకే గ్లాసులో మద్యం సేవించినట్లు రోహిత్‌ బదులివ్వడంతో అపూర్వకు కోపం కట్టలు తెంచుకుంది. అంతే అపూర్వ భర్త మీద పడి గొంతు పట్టుకొని ఊపిరాడకుండా చేసి రెండే రెండు నిమిషాల్లో చంపేసింది. మద్యం మత్తు, బలహీనంగా ఉండడంతో రోహిత్‌ ప్రతిఘటించలేక కేవలం రెండు నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు