దేశ పౌరుడుగా ఉంటూ.. పౌరసత్వం నిరూపించుకోవాలా? జస్టీస్ ఆఫ్త‌బ్ ఆలం

శనివారం, 22 ఫిబ్రవరి 2020 (20:02 IST)
భారత రాజ్యాంగాన్ని ప‌రిరక్షించేందుకు న్యాయవాదులు ముందుండాలని, పతనమౌతున్న ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడంలో సమాజంలో న్యాయవాదుల పాత్ర చాలా కీలకమైంద‌ని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఐఏఎల్‌) 10వ జాతీయ మహాసభల ప్రారంభోత్స‌వంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయ‌మూర్తి జస్టిస్ ఆఫ్త‌బ్ ఆలం పిలుపునిచ్చారు. 
 
శనివారం ఉదయం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘ‌నంగా ప్రారంభమైన ఐ.ఏ.యల్. 10వ జాతీయ మహాసభల ప్రారంభోత్స‌వంలో భాగంగా తొలి రోజున హాజ‌రైన సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయ‌మూర్తి జస్టిస్ ఆఫ్త‌బ్ ఆలం మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో పౌరసత్వం, చట్టం సి.ఆర్.ఏ., .సి.ఏ.ఏ.లు చాలా ప్రమాదక‌ర‌మన్నారు. 
 
పౌరసత్వ చట్టంతో దేశాన్ని చీల్చడం జరుగుతుందన్నారు. దేశ పౌరుడిగా ఉంటూ ప్ర‌తి ఒక్క‌రూ తాను ఈ దేశపు పౌరుడినీ అని నిరూపించుకోవడం దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యానికి న్యాయస్థానాలు ప‌ట్టుగొమ్మ‌ల‌ని అక్క‌డ న్యాయవాదులు ప్రజలకు, ప్రభుత్వానికి మంచి అవగాహనతో మెల‌గాల‌ని సూచించారు. 
 
ప్రజాస్వామ్య సురక్షితంగా కలిగి ఉండటానికి మానవ హక్కుల పరిరక్షణ సామాజిక నిర్వహణలో న్యాయవాదుల పాత్ర వృత్తిలో ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని, న్యాయవ్యవస్థపై ప్రజలపై నమ్మకం స‌డ‌ల‌కుండా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. తొలుత జాతీయ మహాసభల ప్రారంభోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని అతిధులు జ్యోతి ప్రజ్వలన గావించారు. 
 
అనంతరం ఐ.ఏ.యల్ జాతీయ కార్యదర్శి చలసాని అజయ్‌కుమార్ మహాసభలు నిర్వహణలో విజయవాడ నగర పాత్రను స్వాగత తీర్మానం ప్రవేశపెట్టారు. మహాసభలకు విశిష్ట అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి ఆకుల వెంకట శేషసాయి ప్రసంగిస్తూ రాజ్యాంగ హక్కులు పరిరక్షిస్తూ, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించే దానిలో న్యాయవాదులు ప‌ధాన భూమిక పోషించాల‌ని సూచిచారు.  
 
సమాజంలో విశిష్ట సేవలు అందించిన న్యాయవాదులు వి.కే.కృష్ణయ్య సి.పద్మనాభరెడ్డి వంటి వారిని ఆదర్శంగా తీసుకొని  ఐ.ఏ.యల్. స్థాపించబడింద‌న్నారు. వారి ఉద్దేశ్యాన్ని ఆదర్శంగా తీసుకొని న్యాయవాదులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సభలో జాతీయ ఉపాధ్యక్షుడు నీలోఫర్ భగవత్‌, ఐ.ఏ.యల్. జాతీయ అధ్యక్షుడు రాజేందర్ సింగ్ చీమా, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఛైర్మ‌న్ ఘంటా రామారావు, ఐ.ఏ.యల్ రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాల సుబ్బారావు, జాతీయ స‌మాచార హ‌క్కు చ‌ట్టం మాజీ క‌మీష‌న‌ర్‌, ప్రొఫెస‌ర్ మాడభూషి శ్రీధర్, తెలంగాణ‌ ఐ.ఏ.యల్. కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్, సిద్దార్థ లా కాలేజీ ప్రిన్సిపాల్ చెన్నుపాటి దివాకర్‌బాబు, ఐ.ఏ.యల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.వి.పరమేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 700మంది ప్రతినిధులు, న్యాయవాదులు, న్యాయ‌శాస్త్ర విధ్యార్థులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు