ఈ సభ అహ్మదాబాద్లో ఉండే అవకాశముందని చెబుతున్నా.. దీనిని ఇంకా ఖరారు చేయలేదని సమాచారం. ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్లో ఇప్పటికే ఆయన కోసం సూట్ బుక్ చేసినట్టు తెలిసింది. ఇంతకు ముందు క్లింటన్, ఒబామా కూడా ఇదే హోటల్లో బస చేశారు.
చర్చించే అంశాలివీ.......
ట్రంప్ టూర్లో ట్రేడ్ చర్చలే ప్రధానాంశంగా ఉంటుందని అధికారులు చెప్పారు. దీంతో పాటు చైనా, ఇండో, పసిఫిక్, ఆఫ్గనిస్తాన్, ఇరాన్, పాక్‌లో టెర్రరిజం లాంటి అంశాలు కూడా చర్చకువచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.