అతి త్వరలో చిన్నమ్మ వస్తున్నారు : టీటీవీ దినకరన్

ఆదివారం, 27 అక్టోబరు 2019 (14:17 IST)
అక్రమాస్తుల కేసులో నాలుగున్నరేళ్ళ జైలుశిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే మాజీ ప్రధానకార్యదర్శి శశికళ నటరాజన్ త్వరలోనే జైలు నుంచి విడుదలవుతున్నారని అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ తెలిపారు. 
 
ఈ ఏడాది చివరి నాటికి ఆమె విడుదలవుతారన్న ప్రచారంపై ఆయన స్పందిస్తూ, జైళ్ల శాఖకు విచారణ కమిషన్‌ ఇచ్చిన నివేదికలో శశికళ పేరు లేదని తెలిపారు. ఆమె సత్ ప్రవర్తన కారణంగా క్లీన్‌చిట్‌ ఇచ్చినట్లు దీన్ని బట్టి అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.
 
జైలులో అందరి ఖైదీలకు వర్తిసున్న నిబంధనలను ఆమె కూడా పాటిస్తున్నారన్నారు. ఖైదీల వస్త్రధారణ నిబంధనలను కూడా పాటిస్తున్నారని చెప్పారు. గతంలో శశికళ జైలు నుంచి బయటకు వెళ్లి వచ్చినట్టుగా వచ్చిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. 
 
అయితే, ఆమె పూర్తి శిక్షా కాలం ముగిసే వరకు జైలులోనే ఉంటారన్న చర్చ కూడా జరుగుతోంది. ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు చట్టపరంగా ప్రయత్నాలు జరుపుతామని న్యాయవాది రాజచెందూర్‌ పాండియన్‌ కూడా అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు