అమెరికా రహస్య నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలం..

బుధవారం, 10 జనవరి 2018 (10:10 IST)
అమెరికా రహస్య నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. ఈ ఉపగ్రహాన్ని నార్త్‌రప్ గ్రుమన్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. నవంబరులోనే జుమాను ప్రయోగించాల్సి ఉండగా సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేశారు. అయితే ఆదివారం జరిగిన ఈ ప్రయోగంలో తొలి దశను విజయవంతంగా పూర్తి చేసిన రాకెట్ నుంచి రెండో దశలో ఉపగ్రహం వేరుకావడంతో ఇబ్బందులు తలెత్తాయి. 
 
ఈ ఉపగ్రహం అట్లాంటిక్ సముద్రంలో కూలిపోయి వుంటుందని అంటున్నారు. స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్-9 రాకెట్ ఆదివారం అమెరికా రహస్య ఉపగ్రహం జుమాను నింగిలోకి మోసుకెళ్లింది. అయితే రెండో దశలో ప్రయోగం విఫలం కావడంతో ఉపగ్రహం సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రయోగంపై తాము ఇప్పటికిప్పుడు ఎటువంటి వివరాలను బయటకు వెల్లడించలేమని స్పేస్ ఎక్స్ ప్రతినిధి వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు